కింగ్ ను ఆశ్చర్యపరిచిన పోలాండ్ కుర్రాడు

Nagarjuna says awesome zbigniew - Sakshi

తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ అక్కినేని, త్వరలో హలో అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అక్కినేని ఫ్యామిలీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో ఓ వీడియో సాంగ్ కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రిలీజ్ చేశారు.

ఈ పాటపై ఓ పోలాండ్ కుర్రాడి స్పందన ఆసక్తికరంగా మారింది. గతంలో పలు తెలుగు పాటలను ఆలపించి ఇక్కడి వారికి పరిచయం అయిన జిబిగ్జ్, హలో సినిమాలోని మెరిసే మెరిసే పాటను కూడా పాడాడు. తాను పాట పాడిన వీడియోతో పాటు 'హలో అఖిల్.. నా పేరు జిబిగ్జ్. నాది పోలాండ్. మెరిసే మెరిసే పాటలో నీ పెర్ఫామెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది. పాట, డ్యాన్స్ టెరిఫిక్. మీ సినిమా ఘనవిజయం సాధిస్తుంది. అఖిల్, నేను నీ అభిమానిని. హలో టీంకు నా శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ పై స్పందించిన కింగ్ నాగార్జున 'అది అద్భుతం జిబిగ్జ్' అంటూ రిప్లై ఇచ్చారు. అఖిల్ సరసన కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకుడు. అనూప్ రుబెన్స్ సంగీత మందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top