కృష్ణమ్మతో రాజుగారి పాట! | Nagarjuna Om Namo Venkatesaya Movie Release on feb 10th | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మతో రాజుగారి పాట!

Dec 13 2016 11:27 PM | Updated on Jul 15 2019 9:21 PM

కృష్ణమ్మతో రాజుగారి పాట! - Sakshi

కృష్ణమ్మతో రాజుగారి పాట!

మహారాజు తలచుకుంటే ఏ పనైనా క్షణాల్లో జరుగుతుంది. కానీ, రాజుగారి తలపులకు కృష్ణమ్మ దగ్గర తలుపులు మూసుకున్నాయి.

మహారాజు తలచుకుంటే ఏ పనైనా క్షణాల్లో జరుగుతుంది. కానీ, రాజుగారి తలపులకు కృష్ణమ్మ దగ్గర తలుపులు మూసుకున్నాయి. కోరుకున్నది జరగని తరుణంలో రాజులకు కోపం రావడం సహజమే. మరి, ఈ రాజు ఏం చేశారో? ఫిబ్రవరి 10న రిలీజవుతోన్న ‘ఓం నమో వేంకటేశాయ’ చూసి తెలుసుకోవాలి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ భక్తిరస ప్రధాన చిత్రంలో వెంకన్న భక్తుడు హాథీరామ్‌ బాబాగా అక్కినేని నాగార్జున, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్కలు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో కృష్ణమ్మపై మనసుపడిన మహారాజు పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ‘‘జగపతిబాబుది కాస్త ప్రతినాయక ఛాయలున్న పాత్ర. మహారాజుగా ఆయన ఆహార్యం అద్భుతంగా ఉంటుంది. జగపతిబాబు, అనుష్కలపై దర్శకులు రాఘవేంద్రరావు ఓ పాటను కూడా చిత్రీకరించారు’’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సౌరభ్‌ జైన్, విమలా రామన్, ప్రజ్ఞా జైస్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జె.కె. భారవి, సంగీత దర్శకుడు: యం.యం. కీరవాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement