ఓం నమో వేంకటేశాయ ఫస్ట్లుక్ టీజర్ | Nagarjuna Om Namo venkatesaya First look Teaser | Sakshi
Sakshi News home page

ఓం నమో వేంకటేశాయ ఫస్ట్లుక్ టీజర్

Dec 24 2016 10:52 AM | Updated on Jul 15 2019 9:21 PM

ఓం నమో వేంకటేశాయ ఫస్ట్లుక్ టీజర్ - Sakshi

ఓం నమో వేంకటేశాయ ఫస్ట్లుక్ టీజర్

కింగ్ నాగార్జున.. మరోసారి భక్తాగ్రేసరుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారవి కథా కథనాలు అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.,

కింగ్ నాగార్జున.. మరోసారి భక్తాగ్రేసరుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారవి కథా కథనాలు అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా., ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తొలి డైలాగ్ టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

సినిమాలోని పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్లో నాగ్ను భక్తుడిగానే కాక.. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించిన సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడి మార్క్ విజువల్స్తో తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ నాగార్జున కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement