గిన్నీస్‌ కోసం ట్రై చేస్తున్నావా : సమంతతో నాగ్‌ | Nagarjuna Making Fun About Samantha Ay U Trun Function | Sakshi
Sakshi News home page

Sep 12 2018 3:29 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna Making Fun About Samantha Ay U Trun Function - Sakshi

సమంత ప్రధాన పాత్రలో పవన్‌ కుమార్‌ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా యు టర్న్‌. కన్నడలో ఘన విజయం సాదించిన యు టర్న్‌ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రేపు(గురువారం) రిలీజ్‌ కానుంది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భం గా నాగ్ మాట్లాడుతూ ‘రేపు రిలీజ్ అవుతున్న సినిమాల రిజల్ట్ తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా.. ముఖ్యంగా సమంత యు టర్న్‌ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అవుతోంది. సమంత నటించిన మరో తమిళ సినిమా కూడా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ విషయం గురించి ఇప్పుడే సమంతను అడుగుతున్నా గిన్నీస్‌ బుక్‌లో రికార్డ్‌ కోసం ట్రై చేస్తున్నావా.. ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నావ్ అని‌’ అంటూ వేదికపై నవ్వులు పూయించారు నాగ్‌.

నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు, సమంత యు టర్న్‌తో పాటు ఈ నెలాఖరున దేవదాస్‌ కూడా రిలీజ్‌ అవుతుందన్న నాగ్‌.. ఈ సెప్టెంబర్‌ నెల అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement