ఆ మల్టీస్టారర్‌కు క్లాసిక్‌ టైటిల్‌ | Nagarjuna And Nani Movie Title Fixed As Devdas Its Official | Sakshi
Sakshi News home page

ఆ మల్టీస్టారర్‌కు క్లాసిక్‌ టైటిల్‌

Jul 5 2018 6:53 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna And Nani Movie Title Fixed As Devdas Its Official - Sakshi

నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్‌కు ‘దేవదాస్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘ఓ మై ఫ్రెండ్‌’  ఫేం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ‘శాంతాబాయి మెమోరియల్‌ చారిటీ హాస్పిటల్‌’  అనే ఆస్పత్రి రసీదుపై సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు.. ఓ చివర స్టెతస్కోప్‌, మరో చివర గన్‌, బుల్లెట్లతో కూడిన పోస్టర్‌ వినూత్నంగా ఉందంటూ’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో  దేవ అనే డాన్‌ పాత్రలో నాగార్జున, దాస్‌ అనే డాక్టర్‌ పాత్రలో నాని కనిపించనున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఛలో ఫేం రష్మిక మందన నానికి జోడీగా యాక్ట్‌ చేస్తున్నారు. 65 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘దేవదాసు’  సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement