వర్మకు నాగార్జున ఓదార్పు | Nagarjuna Akkineni Retweeted Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

వర్మకు నాగార్జున ఓదార్పు

Feb 27 2018 6:04 PM | Updated on Feb 27 2018 6:04 PM

Nagarjuna Akkineni Retweeted Ram Gopal Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నటి శ్రీదేవి అకాలమరణంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీవ్ర విచారంలో మునిగిపోయి చేస్తున్న ట్వీట్‌కు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన పరోక్షంగా రామ్‌గోపాల్‌ వర్మను ఓదార్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. తన తండ్రి అలానాటి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన మురళీకృష్ణ చిత్రంలోని నీ సుఖమే నే కోరుకున్నా అనే గీతంలోని రెండులైన్‌లను ప్రత్యేకంగా పోస్ట్‌ చేశారు.

శ్రీదేవి చుట్టూ నెగిటివ్‌ వాతావరణం సృష్టిస్తున్నారని, ఈ సందర్భంలో కొంత సానుకూలత కోసం తాను నాగార్జున హీరోగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను, రిలీజ్‌ డేట్‌ను విడుదల చేస్తున్నానంటూ రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. అంతకుముందు కూడా ఆయన శ్రీదేవిపై ఉన్న అభిమానంతో తీవ్ర వేదనకు గురవుతూ ట్వీట్లను చేశారు. దీంతో కాస్తంత ఓదార్పునిద్దామనుకున్నారేమో నాగార్జున పై విధంగా ట్వీట్‌ చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement