రిస్క్ చేస్తున్న యంగ్ హీరో | Naga Shourya to play villain in his next | Sakshi
Sakshi News home page

రిస్క్ చేస్తున్న యంగ్ హీరో

Mar 3 2016 3:57 PM | Updated on Sep 3 2017 6:55 PM

రిస్క్ చేస్తున్న యంగ్ హీరో

రిస్క్ చేస్తున్న యంగ్ హీరో

చందమామ కథలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య, తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్ రోల్స్...

చందమామ కథలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నాగశౌర్య, తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్ బాయ్ రోల్స్ మాత్రమే చేసిన ఈ చాక్లెట్ బాయ్, రూట్ మార్చి చేసిన ప్రయోగం పెద్దగా వర్కవుట్ కాలేదు. మాస్ ఇమేజ్ కోసం చేసిన యాక్షన్ సినిమా జాదూగాడు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మరోసారి రొమాంటిక్ మూవీస్ మీద దృష్టి పెట్టాడు నాగశౌర్య.
 
ప్రస్తుతం అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న నాగశౌర్య, ఆ సినిమా తరువాత మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కిరణ్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న నెక్ట్స్ సినిమాలో హీరోగా, విలన్గా డ్యూయల్ రోల్లో నటించడానికి అంగీకరించాడు. మాస్ క్యారెక్టర్తో మెప్పించలేకపోయిన నాగశౌర్య, నెగెటివ్ రోల్లో ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement