చైతూ కూడా క్రికెటర్‌గానే..! | Naga Chaitanya Samantha Majili Second Look | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 14 2019 12:09 PM | Last Updated on Mon, Jan 14 2019 12:09 PM

Naga Chaitanya Samantha Majili Second Look - Sakshi

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పిరియాడిక్‌ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమాతో ఘనవిజయం సాధించగా ప్రస్తుతం నాని జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. అదే బాటలో అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య కూడా ఓ పిరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మజిలి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పెళ్లి తరువాత నాగ చైతన్య, సమంతలు కలిసి నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. ఇప్పటికే చైతూ, సామ్‌ల లుక్‌లను రిలీజ్‌ చేసిన మజిలి టీం తాజాగా సంక్రాంతి కానుకగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాగ చైతన్య క్రికెటర్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో మరో హీరోయిన్‌ దివ్యాంషా కౌషిక్ లుక్‌ను రివీల్ చేశారు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement