అమెరికాలో ఆటా పాటా | Naga Chaitanya is currently busy with the shooting of his new film | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఆటా పాటా

Jan 31 2018 12:27 AM | Updated on Jan 31 2018 1:46 AM

Naga Chaitanya is currently busy with the shooting of his new film  - Sakshi

నాగచైతన్య

ఫైట్‌ తర్వాత కుర్రాడి ప్రేమకు అమ్మాయి ఫిదా అయినట్లు ఉంది. అందుకే సాంగ్‌ వేసుకోవడానికి అమెరికా వెళ్లనున్నారట ఈ రీల్‌ లవర్స్‌. నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సవ్యసాచి’. హీరో నాగచైతన్య అక్క పాత్రలో భూమిక నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో మాధవన్‌ కనిపించనున్నారు. రీసెంట్‌గా తీసిన హైదరాబాద్‌ షెడ్యూల్‌లో చేజింగ్‌ ఫైట్‌లో విలన్స్‌ను చితక్కొట్టాడు చైతూ.

మార్చిలో జరిగే మరో షెడ్యూల్‌ను చిత్రబృందం అమెరికాలో ప్లాన్‌ చేసిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతోపాటు సాంగ్స్‌ను చిత్రీకరిస్తారట. అక్కడితో సినిమా ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అవుతుందట. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని వినికిడి. ఈ చిత్రం కాకుండా ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement