ఏ నిమిషానికి ఏమి జరుగునో! | Naga Anvesh Ye Nimishaniki Yemi Jaruguno movie opening | Sakshi
Sakshi News home page

ఏ నిమిషానికి ఏమి జరుగునో!

Mar 5 2018 1:16 AM | Updated on Mar 5 2018 1:16 AM

Naga Anvesh Ye Nimishaniki Yemi Jaruguno movie opening - Sakshi

నాగ అన్వేష్‌

‘వినవయ్యా రామయ్య’,‘ఏంజెల్‌’ చిత్రాల ఫేమ్‌ నాగ అన్వేష్‌ కథానాయకుడిగా శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో రూపొందనున్న ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ,ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షో టైమ్‌ స్టూడియోస్‌ సమర్పణలో గణేష్‌ క్రియేషన్స్‌ పతాకంపై లండన్‌ గణేశ్, సీహెచ్‌వీ. నాగేశ్వరరావు నిర్మించనున్నారు. 

‘‘ వినగానే కథ నచ్చింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో క్లైమాక్స్‌ వచ్చే వరకు అర్థం కాదు’’ అన్నారు నాగ అన్వేష్‌. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు శ్రీ కృష్ణ గొర్లె. ‘‘నాగ అన్వేష్‌ని చూస్తే బాలీవుడ్‌ హీరోని చూసినట్లు అనిపిస్తుంది. డిఫరెంట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ ఇది’’ అన్నారు లండన్‌ గణేశ్‌. ‘‘మూడు షెడ్యూల్స్‌లో సినిమాను కంప్లీట్‌ చేస్తాం’’ అన్నారు నాగేశ్వరరావు.
 

Advertisement
 
Advertisement
Advertisement