నా కన్నా మా ఆవిడే ఆయనకు పెద్ద ఫ్యాన్‌! | My wife is Shah Rukh Khan biggest fan, says R Madhavan | Sakshi
Sakshi News home page

నా కన్నా మా ఆవిడే ఆయనకు పెద్ద ఫ్యాన్‌!

Mar 6 2016 1:28 PM | Updated on Sep 3 2017 7:09 PM

నా కన్నా మా ఆవిడే ఆయనకు పెద్ద ఫ్యాన్‌!

నా కన్నా మా ఆవిడే ఆయనకు పెద్ద ఫ్యాన్‌!

నేనే కాదు మా ఆవిడ సరిత కూడా షారుఖ్‌ ఖాన్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటున్నాడు హీరో మాధవన్‌.

ముంబై: నేనే కాదు మా ఆవిడ సరిత కూడా షారుఖ్‌ ఖాన్‌కు పెద్ద ఫ్యాన్‌  అంటున్నాడు హీరో మాధవన్‌. 'నేను షారుఖ్‌కు పెద్ద అభిమానిని. కానీ మా ఆవిడ ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్‌. షారుక్‌ను తొలిసారి కలిసిన విషయం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు నా పక్కన నిల్చున్న తను మాములుగా ఉన్నట్టు కనిపించడానికి ప్రయత్నించింది. నా చేతిని తన గోటితో గోకుతోంది. నేను మీకు బిగ్ ఫ్యాన్ అంటు తను షారుఖ్‌కు చెప్పింది. ఆ సమయంలో తను దాదాపు నా చేతిని గోటితో రక్కింది' అని మాధవన్‌ తెలిపాడు.

'సాలా ఖద్దూస్‌'తో తాజాగా హిట్‌ అందుకున్న మాధవన్‌ ఓ ఈవెంట్‌లో ఈ విషయాలు వెల్లడించాడు. సరిత తన పెద్ద ఫ్యాన్‌ అని తెలిసినప్పటి నుంచి ఆమెకు షారుక్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అభిమానుల్ని ఎలా చూసుకోవాలో ఆయనను చూసి తాను నేర్చుకొన్నానని మాధవన్ చెప్పాడు. షారుఖ్ తాజా సినిమా 'ఫ్యాన్‌' గొప్ప హిట్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement