బావకు నేను చేస్తున్న చివరి ఉత్సవం ఇదే: శాంతి | My last tribute to Srihari garu: Shanti | Sakshi
Sakshi News home page

బావకు నేను చేస్తున్న చివరి ఉత్సవం ఇదే: శాంతి

Oct 9 2014 5:49 PM | Updated on Aug 28 2018 4:30 PM

బావకు నేను చేస్తున్న చివరి ఉత్సవం ఇదే: శాంతి - Sakshi

బావకు నేను చేస్తున్న చివరి ఉత్సవం ఇదే: శాంతి

మా బావకు నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలను మా పిల్లలు కొనసాగిస్తారు. పిల్లు చదువుకుని మంచి స్థానాల్లో ఉండాలని నేను ఆశపడ్డాను.

మా బావకు నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలను మా పిల్లలు కొనసాగిస్తారు. పిల్లు చదువుకుని మంచి స్థానాల్లో ఉండాలని నేను ఆశపడ్డాను. కాని వాళ్లు సినిమాల్లో స్థిరపడ్డాలని బావ కోరుకున్నారు. వాళ్లు కూడా బావ కోరికను నెరవేర్చాలని అనుకుంటున్నారు. 
 
మా ఫ్యామిలీకి మొదటి నుంచి చిత్ర పరిశ్రమలో అందరితోనూ, జర్నలిస్తులతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇకపై కూడా తాము ఆ సంబంధాలను కొనసాగిస్తాం అని శ్రీహరి సతీమణి శాంతి ఉద్వేగంగా ప్రసంగించారు. నా కోరిక మేరకు నేను దర్శకుడిగా మారుతాను. తమ్ముడు హీరో అవుతాడు అని శ్రీహరి కుమారుడు శశాంక్ అని అన్నారు. 
 
దివంగత సినీనటుడు శ్రీహరి ప్రథమ వర్ధంతి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, వీర శంకర్, దేవీ ప్రసాద్, బాబీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement