ప్చ్... పాపం! | My curves limit me in Hollywood: Salma Hayek | Sakshi
Sakshi News home page

ప్చ్... పాపం!

Feb 23 2015 7:19 AM | Updated on Sep 2 2017 9:47 PM

ప్చ్... పాపం!

ప్చ్... పాపం!

‘బోల్డ్’గా మాట్లాడటంలో హాలీవుడ్ తారలను ఎవరూ బీట్ చేయలేరేమో! ఎలాంటి ‘దాపరికాలూ’ లేకుండా ఎంచక్కా అన్నీ ‘షేర్’ చేసేసుకుంటారు.

‘బోల్డ్’గా మాట్లాడటంలో హాలీవుడ్ తారలను ఎవరూ బీట్ చేయలేరేమో! ఎలాంటి ‘దాపరికాలూ’ లేకుండా ఎంచక్కా అన్నీ ‘షేర్’ చేసేసుకుంటారు. మెక్సికన్ బ్యూటీ సల్మా హయెక్... తనకు హాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడానికి కారణాలను రీసెంట్‌గా పరిశోధించినట్టుంది. మంచి కథలు దొరకలేదనో... మరేదో కారణమో చెప్పకుండా... తాను సక్సెస్ కాకపోవడానికి తన ఒంపుసొంపులే కారణమని తేల్చింది. ‘ముఖ్యంగా నేను పొట్టి. చూడగానే పక్కింటి అమ్మాయిలా అనిపించను.

ఇతర తారల్లా స్టీరియోటైప్ బాడీ స్ట్రక్చర్ కాదు. నా కర్వ్స్ డిఫరెంట్. సో... ఇప్పుడున్న ట్రెండ్‌కు సరిపోను’ అంటూ మనసులో మాట చెప్పుకొచ్చిందీ నలభై ఎనిమిదేళ్ల అమ్మడు. ఉన్నదాన్ని ఏదో ఒకరకంగా ప్రజంట్ చేసి... సక్సెస్ అయితే తమ ఖాతాలో వేసుకుని, ఫెయిల్యూర్స్‌ను యూనిట్ పైకి నెట్టేసే పీపుల్‌ని ఇండస్ట్రీలో చాలా మందినే చూసుంటారు. కానీ... సల్మాలా ఫ్రాంక్‌గా ఎక్స్‌ప్రెషన్స్ షేర్ చేసుకొనేవారు చాలా అరుదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement