ఇర్మా బాదితులకు అండగా హాలీవుడ్ | hollywood Celebs join hands to raise funds for hurricane victims | Sakshi
Sakshi News home page

ఇర్మా బాదితులకు అండగా హాలీవుడ్

Sep 13 2017 4:16 PM | Updated on Sep 22 2017 11:44 AM

hollywood Celebs join hands to raise funds for hurricane victims

ఇర్మా హరికేన్ విధ్వంసంతో అల్లాడిపోయిన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ తారలు ముందుకు వచ్చారు.

ఇర్మా హరికేన్ విధ్వంసంతో అల్లాడిపోయిన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ తారలు ముందుకు వచ్చారు.  సినీ కళాకారులతో పాటు పలువురు టీవీ, క్రీడా ప్రముఖులు కూడా వీరితో చేతులు కలిపారు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ : ఏ బెనిఫిట్ ఫర్ హరికేన్ రిలీఫ్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జార్జ్ క్లోని, జూలియా రాబర్ట్స్, జస్టిన్ బీబర్, ఓప్రా విన్ఫ్రేలు పాల్గొన్నారు.

వీరితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు వీడియో మేసేజ్ ల ద్వారా హరికేన్ బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా సాయం చేసేందుకు ముందుకు రావాలని సహాయకార్యక్రమాల్లో ఎలాంటి పొలిటికల్ ఎజెండాలకు తావునివ్వకూడదని తెలిపారు. త్వరలో స్టేజ్ షోస్ ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు స్టార్స్.

Advertisement
 
Advertisement
Advertisement