breaking news
Irma Hurricane
-
హరికేన్ బాధితులకు జెన్నీఫర్ సాయం
ఇర్మా, మారియా హరికేన్ లతో కుదేలైన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ జెన్నీఫర్ లోపెజ్, హరికేన్ బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులకు పది లక్షల అమెరికన్ డాలర్లు సాయంగా ప్రటించారు. ఈ హరికేన్ మూలంగా తను కూడా వ్యక్తిగతంగా చాలా నష్టపోయాన్న లోపెజ్, తన కుటుంబ సభ్యులను కూడా కలుసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తి చేశారు. తాను సాయం అందించటంతో పాటు అభిమానులు కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న లాస్ వెగాస్ షో ద్వారా వచ్చే మొత్తాన్ని హరికేన్ బాధితులకు అందించనున్నట్టుగా ప్రకటించారు జెన్నీఫర్. -
ఇర్మా బాదితులకు అండగా హాలీవుడ్
ఇర్మా హరికేన్ విధ్వంసంతో అల్లాడిపోయిన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ తారలు ముందుకు వచ్చారు. సినీ కళాకారులతో పాటు పలువురు టీవీ, క్రీడా ప్రముఖులు కూడా వీరితో చేతులు కలిపారు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ : ఏ బెనిఫిట్ ఫర్ హరికేన్ రిలీఫ్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జార్జ్ క్లోని, జూలియా రాబర్ట్స్, జస్టిన్ బీబర్, ఓప్రా విన్ఫ్రేలు పాల్గొన్నారు. వీరితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు వీడియో మేసేజ్ ల ద్వారా హరికేన్ బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా సాయం చేసేందుకు ముందుకు రావాలని సహాయకార్యక్రమాల్లో ఎలాంటి పొలిటికల్ ఎజెండాలకు తావునివ్వకూడదని తెలిపారు. త్వరలో స్టేజ్ షోస్ ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు స్టార్స్. -
ఫ్లోరిడా తీరాన్ని తాకిన 'ఇర్మా'
-
అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
-
అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇర్మా హరికేన్ ధాటికి వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిరాశ్రయు లైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుం బాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి తెలుగు సంఘాలు అప్రమత్తమై ఇర్మా బాధితుల్లో ఉన్న తెలుగువారి జాడ కోసం ప్రయత్నిస్తున్నాయి. సమీపంలోని ఇతర నగరాల్లో ఉన్న తెలుగువారితో సంప్రదించి వీలైనంత ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించేలా చూస్తున్నాయి. ఇక వేరే నగరాల్లోని స్నేహితులు, బంధువుల వద్దకు వెళ్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ రిక్ స్కాట్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత కేంద్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు తలదాచుకుంటున్నారు. ఇందులో కొన్ని తెలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రాణనష్టం లేకుండా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది.