‘ప్రపంచ సినిమాపైనే నా గురి’ | my concentration on world: radhika aapte | Sakshi
Sakshi News home page

‘ప్రపంచ సినిమాపైనే నా గురి’

May 29 2017 6:09 PM | Updated on Sep 5 2017 12:17 PM

‘ప్రపంచ సినిమాపైనే నా గురి’

‘ప్రపంచ సినిమాపైనే నా గురి’

ప్రపంచ సినిమాపైనే తన గురి అంటోంది నటి రాధిక ఆప్తే. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీపుల్‌ నటి ఇటీవల అర్ధ నగ్న, నగ్న దృశ్యాల్లో నటించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

చెన్నై: ప్రపంచ సినిమాపైనే తన గురి అంటోంది నటి రాధిక ఆప్తే. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీపుల్‌ నటి ఇటీవల అర్ధ నగ్న, నగ్న దృశ్యాల్లో నటించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. రజనీకాంత్‌కు జంటగా కబాలి చిత్రంలో నటించి మరింత ప్రాచూర్యం పొందిన రాధిక ఆప్తే ఒక్క తమిళంలోనే కాకుండా హింది, ఇంగ్లిష్, బెంగాలీ, మరాఠి, మలయాళం అంటూ వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా వరస పెట్టి నటించేస్తోంది. అంతే కాదు ఆఫ్‌బీట్‌ చిత్రాల్లో నటించి సంచలన నటిగా సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ప్రస్తుతం ఒక హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. హాలీవుడ్‌ చిత్రాలపై గురి పెట్టినట్లున్నారే అన్న ప్రశ్నకు రాధిక ఆప్తే బదులిస్తూ, హాలీవుడ్, బ్రిటీష్‌ చిత్రాలే కాదు తన గురి ప్రపంచ సినిమాపై ఉందన్నారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకోవడమేనంటూ చెప్పుకొచ్చింది. అందుకు తనను తాను సిద్ధం చేసుకున్నానని తెలిపింది. కమర్షియల్‌ చిత్రాలు, కళాత్మక చిత్రాలు అంటూ రెండు రకాల చిత్రాలు తానే చేశాననీ ఈ రెండింటి మద్య చిన్న గీతే ఉంటుందనీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఛాలెంజింగ్‌తో కూడిన మంచి పాత్రలు తనను వెతుక్కుంటూ వస్తున్నాయనీ, ఇలాంటి పాత్రలనే తాను కోరుకుంటున్నాననీ నటి రాధిక ఆప్తే అంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement