సంగీత చర్చల్లో... గౌతమీపుత్రుడు! | Music Sittings started for Gautamiputra Satakarni | Sakshi
Sakshi News home page

సంగీత చర్చల్లో... గౌతమీపుత్రుడు!

Apr 26 2016 11:45 PM | Updated on Aug 29 2018 1:59 PM

సంగీత చర్చల్లో... గౌతమీపుత్రుడు! - Sakshi

సంగీత చర్చల్లో... గౌతమీపుత్రుడు!

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథాంశంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న తెలుగువారి చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా పాలించిన శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథాంశంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న తెలుగువారి చారిత్రక కథా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే అట్టహాసంగా ప్రారంభమైంది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇప్పటికే ఈ సినిమా సంగీత చర్చలు ప్రారంభమయ్యాయి’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న దేవిశ్రీప్రసాద్ ఈ సంగతి ట్విట్టర్‌లో వెల్లడించారు. దేవిశ్రీ ప్రసాద్, బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ఆ మధ్య వచ్చిన మంచి మ్యూజికల్ హిట్ ‘లెజెండ్’ అందరికీ గుర్తొస్తుంది. దాంతో, ఇప్పుడు ఈ చిత్ర సంగీతంపై కూడా అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement