ప్రభాస్తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..! | Murugadoss interested in film with Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..!

Sep 1 2017 1:35 PM | Updated on Sep 17 2017 6:15 PM

ప్రభాస్తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..!

ప్రభాస్తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..!

ప్రస్థుతం మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ త్వరలో

ప్రస్థుతం మహేష్ బాబు హీరోగా స్పైడర్ సినిమాను తెరకెక్కిస్తున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ త్వరలో మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడట. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ లలోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న మురుగదాస్ భారీ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ పేరు తెచ్చుకున్నాడు. సౌత్ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా మురుగదాస్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు.

స్పైడర్ తరువాత తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్. అయితే పలు బాలీవుడ్ సంస్థలు మురుగదాస్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాస్, మురుగదాస్ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి అయితే కాని ఈ కాంబినేషన్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement