ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’ | MS Kumar producing new film 'cut chesthe' | Sakshi
Sakshi News home page

ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’

Aug 13 2013 11:37 PM | Updated on Sep 1 2017 9:49 PM

ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’

ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’

సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’. విజయ్, సుభాష్, జీవిత, మధుమిత ముఖ్య తారలు.

సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎమ్మెస్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కట్ చేస్తే..’. విజయ్, సుభాష్, జీవిత, మధుమిత ముఖ్య తారలు. రచయిత  పడాల శివసుబ్రహ్మణ్యం దర్శకుడు.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. 
 
‘‘ఇది హారర్, యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్. కాలేజీ బ్యాక్డ్రాప్లో సాగే ఓ వినూత్నమైన కథ’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘రెండో షెడ్యూల్ను బ్యాంకాక్, మలేసియాలో జరపాలనుకుంటున్నాం. 
 
క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కథ చెప్పినదానికన్నా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: సంజీవరాణి.
 

Advertisement
 
Advertisement
Advertisement