'నిర్మాతల డబ్బుకి గౌరవం ఇస్తా' | mportant to respect producer's money, time, Director Hari Gopalakrishnan | Sakshi
Sakshi News home page

'నిర్మాతల డబ్బుకి గౌరవం ఇస్తా'

Oct 20 2014 4:13 PM | Updated on Sep 2 2017 3:10 PM

సినిమాలను ఎంతో ఇష్టపడి తెరకెక్కించే నిర్మాతల డబ్బుకు తగిన గౌరవిస్తానని తమిళ దర్శకుడు హరి గోపాల్ కృష్ణన్ స్పష్టం చేశాడు.

చెన్నై: సినిమాలను ఎంతో ఇష్టపడి తెరకెక్కించే నిర్మాతల డబ్బుకు తగిన గౌరవిస్తానని తమిళ దర్శకుడు హరి గోపాల్ కృష్ణన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం 'పూజాయ్' సినిమాను విడుదల చేసే పనిలో ఉన్న ఈ దర్శకుడు ఐఏఎన్ఎస్ తో మాట్లాడారు. మనం ఇచ్చిన సమయం కంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తే నిర్మాతను ఇబ్బందులకు గురిచేసేనట్లేనని పేర్కొన్నాడు. ప్రతీ అదనపు నిమిషం కూడా నిర్మాతకు భారంగా పరిగణిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

 

'నేను సినిమాలను పూర్తి చేయడానికి 100 రోజుల సమయం అడుగుతాను.అయితే సాధ్యమైనంత వరకూ 90 రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తాను'అని తెలిపాడు. 'పూజాయ్'సినిమాను ఈ బుధవారం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇది తెలుగులో 'పూజా' ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement