
ఏదైనా మంచి పని స్టార్ట్ చేయటానికి మంచి రోజు కోసం వెతుకుతాం. మోహన్‌లాల్ కూడా ఒక మంచి పనిని తన బర్త్‌డే రోజే స్టార్ట్ చేశారు. మోహన్‌లాల్ బర్త్‌డే మే 21న. తన బర్త్‌డే సందర్భంగా విశ్వ శాంతి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు మోహన్ లాల్ తెలిపారు. పేదలకు సహాయం చేయాలనే మంచి ఆలోచనతో ఈ ఫౌండేషన్ మొదలుపెట్టారట మోహన్‌లాల్. ఈ ఫౌండేషన్, దాన్ని మొదలు పెట్టాలనే ఆలోచన గురించి మోహన్‌లాల్ మాట్లాడుతూ – ‘‘నా బర్త్‌డే రోజు నేను ఎక్కువగా మా తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తుంటాను. విశ్వ శాంతి పేరుని మా అమ్మా నాన్న పేర్ల (విశ్వనాధన్ నాయర్, శాంతకుమారి) నుంచి తీసుకున్నాను. నా ఫ్యాన్స్, నా వెల్ విషర్స్ అందరూ ఈ ఫౌండేషన్‌లో భాగం అవ్వండి. అదే మీరంతా నాకిచ్చే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’’ అని పేర్కొన్నారు.