ఆ భారీ బడ్జెట్ చిత్రం ఆగిపోయింది!

Mohanlal And B R Shetty Mahabharata Malayalam Movie Shelved - Sakshi

మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో మహా భారతగాథను తెరకెక్కిస్తున్నట్టుగా చాలా కాలం క్రితమే ప్రకటించారు. ప్రముఖ రచయిత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్‌ చేశారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్‌ శెట్టి, శ్రీకుమార్‌ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు.

సినిమాను తెరకెక్కించేందుకు వీలుగా నవలను మార్చి స్క్రీన్‌ప్లేను కూడా వాసుదేవన్‌ నాయరే సమకూర్చారు. అయితే సినిమా ప్రకటించి మూడేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ చాలా రోజుల కిందటే నాయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా నిర్మాత బీఆర్‌ శెట్టి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ మహా భారతం ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. రచయితం దర్శకుల మధ్య వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top