అద్భుతం జరుగుతుంది | Miracle Movie Poster Release | Sakshi
Sakshi News home page

అద్భుతం జరుగుతుంది

Dec 30 2018 12:47 AM | Updated on Dec 30 2018 12:47 AM

Miracle Movie Poster Release - Sakshi

సుమన్‌ రాణా, హరి గిల్స్

హరి గిల్స్, సుమన్‌ రాణా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మిరాకిల్‌’. వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ బ్యానర్స్‌ పై రుద్రపట్ల వేణుగోపాల్‌ (ఆర్‌.వి.జి) దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రూపొందుతోన్న సస్పెన్స్‌  థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రుద్రపట్ల వేణుగోపాల్‌ మాట్లాడుతూ–  ‘‘దర్శకుడిగా ఇది నా ఐదో సినిమా.

వాస్తవ సంఘటనలకు కల్పన జోడించి ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నాం. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంతో రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తవుతుంది. మార్చిలో మారిషస్‌లో పాటల చిత్రీకరణ జరిపి, మే 24న సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది ఫస్ట్‌ సినిమా. వేణుగోపాల్‌ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. కచ్చితంగా మిరాకిల్‌ అవుతుంది’’ అన్నారు  హరి గిల్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement