‘నాన్న చనిపోతే పెద్దగా బాధ పడలేదు’

Milind Soman Pours His Heart Out In Emotional Post For His Dad - Sakshi

తన నాన్న చనిపోయినప్పుడు పెద్ద బాధ పడలేదు అంటున్నాడు బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్. తన తండ్రిపై పెద్దగా అభిమానం కూడా లేదన్నారు. ఇటీవల ఆయన రాసిన ‘మేడ్‌ ఇన్‌ ఇండియా: ఎ మెమోయిర్‌’ బుక్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఇక తన నాన్నతో ఆయనకు ఉన్న రిలేషన్‌షిప్‌ గురించి సోమవారం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ కూడా పెట్టాడు. తన తండ్రిని  ఎప్పుడూ అభిమానించలేదని చెప్పుకొచ్చారు.

(చదవండి : వారి పెళ్లి అయిపోయింది!!)

‘1995 సంవత్సరం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆ ఏడాది నాకు తీపి, చేదు రెండు జ్ఞాపకాలను అందించింది. 1995 జనవరిలో మా నాన్న మృతి చెందారు. ఆయన మృతి నాకు పెద్దగా బాధ కలిగించలేదు. మిశ్రమ భావాలు నాలో కలిగాయి. మా నాన్నపై నాకు ఎప్పుడూ అభిమానం లేదు. ఆయన మాత్రం నాపై ప్రేమను చూపించాడు. అతను చనిపోయే ఐదు సంవత్సరాల ముందే మా ఇంటి నుంచి బయటికి వెళ్లారు. ఆ సమయంలో నాకు పెద్ద ఉపశమనం కలిగినట్లు భావించాను. కానీ ఆయన చనిపోయే రోజు అంబులెన్స్‌లో నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్తుంటే నాకు చాలా  బాధ కలిగింది. నాన్నతో నా భావోద్వేగాలను పంచుకోవాలనుకున్నాను కానీ కుదర్లేదు’ అని మిలింద్‌ చెప్పుకొచ్చారు. 

ఇక తండ్రి మృతి చెందిన కొద్ది రోజులకు ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మ్యూజిల్‌ వీడియో‘ మేడ్ ఇన్ ఇండియా’ విడుదలైంది. దీనితో మిలింద్‌కు పాపులారిటీ పెరిగిపోయింది. దీని గురించి కూడా మిలింద్‌ వివరించారు. 

‘ నాన్న మృతి చెందిన కొద్ది రోజులపై ‘ మేడ్‌ ఇన్‌న ఇండియా’ విడుదలైంది. అది నా జీవితాన్నే మార్చేసింది. ఆ మ్యూజిక్‌ వీడియోతో నా జీవితంలో శాంతి నెలకొంది. నన్ను సూపర్‌ మోడల్‌గా, హీరోగా నిలబెట్టింది. అందుకే నా జీవితంలో 1995 ముఖ్యమైన సంవత్సరం’  అని మిలింద్‌ వివరించారు. మిలిందర్‌ భాగోద్వేగ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘ మీ తండ్రి పట్ల  మీకు ఉన్న అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పారు. ఇలాంటి పోస్ట్‌ పెట్టాలందే ధైర్యం ఉండాలి’,  మీ మనసు చెప్పింది మీరు రాశారు’  అని కామెంట్లు చేస్తున్నారు. 

మిలింగ్ సోమన్ 80, 90 దశకాల్లో టాప్ మోడల్. మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. కామసూత్ర యాడ్‌లో అర్ధనగ్నంగా నటించి అప్పట్లో సంచలనం రేపారు. 53 ఏళ్ల మిలింద్.. తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top