వారి పెళ్లి అయిపోయింది!! | Actor Milind Soman ties the knot with Ankita Konwar | Sakshi
Sakshi News home page

Apr 22 2018 4:48 PM | Updated on Apr 22 2018 5:07 PM

Actor Milind Soman ties the knot with Ankita Konwar - Sakshi

ప్రేమకు వయసుతో నిమిత్తం లేదని మిలింద్‌ సోమన్‌, అకింత కోన్వర్‌ జంట నిరూపించింది. మోడల్‌, నటుడు అయిన మిలింద్‌ ఆదివారం ప్రేమికురాలు అంకితను పెళ్లాడారు. 52 ఏళ్ల మిలింద్‌ గత కొన్నాళ్లుగా 23 ఏళ్ల అంకితతో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య దాదాపు 30 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమేంటి? అంటూ పలువురు మిలింద్‌ను తప్పుబట్టారు. వీరి అనుబంధంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి.



ఈ విమర్శలను ఏమాత్రం లెక్కచేయని మిలింద్‌-అంకిత జంట ఆదివారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ముంబైలోని అలిబౌగ్‌లో బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన చిత్రాలను బంధుమిత్రులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. వీరి పెళ్లి సన్నిహితుల నడుమ ఒకింత రహాస్యంగా జరిగినా.. సోషల్‌ మీడియాలో వీరి పెళ్లి ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement