సన్నీకి సవాల్‌.. సిన్మాల్లోకి మరో పాపులర్‌ పోర్న్‌స్టార్‌! | Mia Khalifa to act in Malayalam film Chunkzz 2 | Sakshi
Sakshi News home page

Oct 31 2017 8:31 PM | Updated on Sep 18 2018 8:00 PM

Mia Khalifa to act in Malayalam film Chunkzz 2 - Sakshi

మరో పాపులర్‌ పోర్న్‌స్టార్‌ భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు పోర్న్‌స్టార్‌గా పేరొందిన సన్నీ లియోన్‌ ఇప్పటికే భారతీయ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసింది. హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ సన్నీ లియోన్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఈ భామకు షాక్‌ ఇచ్చేందుకు పాపులర్‌ పోర్న్‌స్టార్‌ మియా ఖలీఫా సిద్ధమవుతోంది.

కొన్నాళ్లపాటు బూతుసినిమాల్లో నటించి.. ఆ ఫీల్డ్‌ నుంచి తప్పుకున్న ఈ అమ్మడు మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. మలయాళ అడల్ట్‌ కామెడీ సినిమా 'చుంక్జ్‌' సీక్వెల్‌లో నటించడానికి ఈ భామ అంగీకరించింది. ఈ సినిమాలో ఓ పాత్ర పోషించడంతోపాటు ఐటెం సాంగ్‌లో మియా ఖలీఫా నటించనుందని చిత్ర దర్శకుడు ఒమర్‌ లులు ధ్రువీకరించారు. సన్నీ లియోన్‌ తర్వాత భారతీయ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న రెండో పోర్న్‌స్టార్‌గా మియా ఖలీఫా నిలువబోతున్నది. బూతు సినిమాల నటిగా ఒక ఏడాది పాటు పనిచేసి..పాపులర్‌ అయిన ఈ భామ ప్రస్తుతం ఓ స్పోర్ట్స్‌ యూట్యూబ్‌ చానెల్‌ రిపోర్టర్‌గా పనిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement