బాలీవుడ్‌లో తెలుగు దర్శకుల వార్‌

Mental Hai Kya To Lock Horns With Kabir Singh - Sakshi

సౌత్‌లో సక్సెస్‌ అయిన కథలు, సినిమాలు మాత్రమే కాదు మన దర్శకులు కూడా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు తెలుగు దర్శకులు బాలీవుడ్ తెర మీద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.

షాహిద్‌ కపూర్‌ హీరోగా కబీర్‌ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. జూన్‌ 21న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. అదే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న మరో బాలీవుడ్ మూవీ మెంటల్‌ హై క్యా. కంగనా రనౌత్‌, రాజ్‌ కుమార్‌ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు కూడా తెలుగు వాడే. అనగనగా ఓ ధీరుడు, సైజ్‌ జీరో లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకుడు. ఇలా ఇద్దరు తెలుగు దర్శకులు బాలీవుడ్ సినిమాలతో పోటి పడుతుండటంపై టాలీవుడ్‌లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top