ఆయనను క్షమాపణలు కోరిన మెగాస్టార్‌! | Megastar Chiranjeevi Reveals His New Movie Title And Said Sorry To Director | Sakshi
Sakshi News home page

ఆయనను క్షమాపణలు కోరిన మెగాస్టార్‌!

Mar 2 2020 8:50 PM | Updated on Mar 2 2020 9:03 PM

Megastar Chiranjeevi Reveals His New Movie Title And Said Sorry To Director - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా టైటిల్‌ను దర్శకుడు ఇంతవరకూ రిలీజ్‌ చేయలేదు. దీంతో చిరు సినిమా టైటిల్‌ గురించి సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది. సినిమా పేరు ఏమై ఉంటుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా దర్శకుడు శివ ఈ సినిమా టైటిల్‌ను సీక్రెట్‌గా ఉంచి అభిమానులకు థ్రిల్‌ ఇద్దామనుకుంటే.. చిరు నీళ్లు జల్లారు.

కాగా నటుడు బ్రహ్మాజీ కొడుకు నటిస్తున్న ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు స్టేజీపై తన సినిమా గురించి మాట్లాడారు. ఇక మాటల మధ్యలో సినిమా టైటిల్‌ ‘ఆచార్య’ అని చెప్పేశాడు. ఇక అభిమానులకు తమ సినిమా టైటిల్‌ తెలిసిపోయిందని దర్శకుడు తలపట్టుకుంటున్నాడు. కాగా చిరు అనుకోకుండా టైటిల్‌ చెప్పడంతో దర్శకుడికి ఆయన సారీ కూడా చెప్పారు. 

కష్టపడితే స్టార్లు అవుతారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement