రుద్రమకు మెగా వాయిస్ | Mega Voice to the Rudrama | Sakshi
Sakshi News home page

రుద్రమకు మెగా వాయిస్

Jun 14 2015 11:01 PM | Updated on Sep 3 2017 3:45 AM

రుద్రమకు మెగా వాయిస్

రుద్రమకు మెగా వాయిస్

చిరంజీవి వెండితెరపై కనిపించి, చాలా ఏళ్లయ్యింది. ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అని ఎదురు చూస్తున్న...

చిరంజీవి వెండితెరపై కనిపించి, చాలా ఏళ్లయ్యింది. ఎప్పుడెప్పుడు కనిపిస్తారా? అని ఎదురు చూస్తున్న అభిమానులను ఇటీవలే తన 150వ చిత్రం ప్రకటించి, ఆనందింపజేశారు చిరంజీవి. ఈ చిత్రం ద్వారా ఆయన తెరపై కనిపించడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోపు వినిపించనున్నారు. అర్థం కావడంలేదు కదూ.. అనుష్క టైటిల్ రోల్‌లో రాగిణి గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చారిత్రాత్మక చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ- ‘‘అడగ్గానే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చిరంజీవిగారు అంగీకరించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మరింత హైప్ వచ్చింది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement