పెళ్లైతే హీరోయిన్‌గా పనికి రామా? | Married actresses, mothers considered dead commodity | Sakshi
Sakshi News home page

పెళ్లైతే హీరోయిన్‌గా పనికి రామా?

Mar 31 2018 3:46 AM | Updated on Apr 3 2019 6:34 PM

Married actresses, mothers considered dead commodity - Sakshi

.... అంటున్నారు రాణీ ముఖర్జీ. దర్శక–నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన తర్వాత రాణీ సినిమాలకు దూరమైపోతారని అనుకున్నారంతా. కానీ ‘మర్దానీ’ సినిమాతో కమ్‌బ్యాక్‌ ఇచ్చి అందరి అంచనాలను తారుమారు చేశారు. ఇప్పుడు తన లేటెస్ట్‌ సినిమా ‘హిచ్కీ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు రాణీ. ఈ సినిమా హిట్‌  చాలా ప్రత్యేకమైంది అంటున్నారామె. ‘‘సాధారణంగా పెళ్లైతే హీరోయిన్‌గా పనికి రారు అనే ఒకలాంటి అపోహ మన ఇండస్ట్రీలో ఉంది. ఈ అపోహ కచ్చితంగా తొలగిపోవాలి. పెళ్లయినవారు హీరోయిన్‌లుగా సేల్‌ అవ్వరు, ఎవ్వరూ చూడరు అనే అభిప్రాయం తప్పని ఈ సినిమా హిట్‌తో ప్రేక్షకులు నిరూపించారు.

పెళ్లై పిల్లలు పుడితే మాలో ఏం మారుతుంది? మేం ఎప్పుడూ యాక్టర్స్‌మే కదా. అప్పుడు ఉన్నంత ప్రొఫెషనల్‌గానే ఇప్పుడూ ఉంటాం. మాకంటూ సెపరేట్‌ లైఫ్‌ ఉండకుడదా?  మా పర్సనల్‌ లైఫ్‌ని కెరీర్‌ కోసం త్యాగం చేయాలా? మేల్‌ యాక్టర్స్‌కి ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలం హీరోయిన్స్‌ మాత్రమే కెరీర్‌ కోసం మ్యారేజ్‌ని ఆలస్యం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లైతే హీరో యిన్స్‌కు మార్కెట్‌లో సెల్లింగ్‌ ఫ్యాక్టర్‌ పోతుంది కాబట్టి. ఈ సినిమాపై అభిమానులు చూపించిన ప్రేమ చూస్తే అర్థం అవుతోంది. హీరోయిన్‌కి పెళ్లి అయిందా? తల్లయిందా? అని కాదు. స్క్రీన్‌ మీద ఆ హీరోయిన్‌ ఎలా కనిపించారన్నదే వాళ్లకు ముఖ్యం’’ అని పేర్కొన్నారు రాణీ ముఖర్జీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement