నువ్వే మను అన్నాడు | manu movie trailer release | Sakshi
Sakshi News home page

నువ్వే మను అన్నాడు

Aug 13 2018 12:36 AM | Updated on Aug 13 2018 12:36 AM

manu movie trailer release - Sakshi

చాందినీ, రాజా గౌతమ్, ఫణీంద్ర

‘‘మను’ సినిమా మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్‌ కాకముందు చాలా మంది షార్ట్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ని కలిశాను. 40 – 50 కథలు విన్నాను. ‘మధురం’ షార్ట్‌ ఫిల్మ్‌ చూసి ఫణిని అభినందించా. అప్పుడే ఫణి ‘మను’ కథ చెప్పాడు’’ అన్నారు రాజా గౌతమ్‌. నూతన దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీగా నిర్మితమైంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. గౌతమ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ కథ విన్నాక బావుందని అప్రిషియేట్‌ చేశాను. కొన్ని రోజుల తర్వాత నువ్వే ‘మను’ క్యారెక్టర్‌ చేస్తున్నావన్నాడు ఫణి.

చాలా సంతోషంగా అనిపించింది. 115 మంది డబ్బు పెట్టారు. ఎంతో బాధ్యతగా తీశాడు. సెప్టెంబర్‌ 7న సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశా. ట్రైలర్‌ కంటే సినిమా ఎన్నో రెట్లు బాగుంటుంది. ఫణి విజన్‌ ఉన్న దర్శకుడు’’ అన్నారు చాందిని. ‘‘నాకు ఎమోషనల్‌ మూమెంట్‌. నా ఇన్వెస్టర్స్‌ని మర్చిపోలేను. వాళ్లందరికీ థ్యాంక్స్‌. నా సినిమా ఎక్కువ మాట్లాడుతుందని నమ్ముతున్నాను. నిర్వాణ సినిమాస్‌ వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ఒక సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి కథ కావాలి. ఫణి అలాంటి కథతోనే వస్తున్నాడు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత మాపై ఉందనిపించింది’’ అన్నారు నిహార్‌.  ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్, సంగీతం: నరేశ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement