మహేష్ సినిమాతో మంజుల మూవీ ట్రైలర్ | manjula movie triler with spyder | Sakshi
Sakshi News home page

మహేష్ సినిమాతో మంజుల మూవీ ట్రైలర్

Aug 11 2017 5:02 PM | Updated on Sep 17 2017 5:25 PM

మహేష్ సినిమాతో మంజుల మూవీ ట్రైలర్

మహేష్ సినిమాతో మంజుల మూవీ ట్రైలర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పెడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పెడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరో ఓ చిన్న సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సోదరి, నటి అయిన మంజులు తొలిసారిగా దర్శకత్వ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జెమినీ కిరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాతో మంజుల దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమైనా దస్తర్, త్రిధా చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ స్పైడర్ సినిమా బ్రేక్ లో ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement