నవంబర్ నుంచి మళ్లీ మనీషా షూటింగ్ | Manisha koirala to restart work from november | Sakshi
Sakshi News home page

నవంబర్ నుంచి మళ్లీ మనీషా షూటింగ్

Aug 12 2013 3:10 PM | Updated on Aug 11 2018 8:29 PM

నవంబర్ నుంచి మళ్లీ మనీషా షూటింగ్ - Sakshi

నవంబర్ నుంచి మళ్లీ మనీషా షూటింగ్

అందాల తార మనీషా కొయిరాలా త్వరలోనే మళ్లీ వెండితెర మీద కనిపించబోతోంది.

తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో అంటూ తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల ప్రేక్షకుల హృదయాలు దోచిన అందాల తార మనీషా కొయిరాలా త్వరలోనే మళ్లీ వెండితెర మీద కనిపించబోతోంది. కేన్సర్పై పోరాటానికి యోగాను మంచి ఆయుధంగా వాడుకున్న ఈ నేపాలీ సుందరి రాబోయే నవంబర్లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మనీషా మేనేజర్ తెలిపారు.

ప్రస్తుతం ఆరోగ్యం కోసం యోగా, ధ్యానాలపైనే మనీషా కొయిరాలా పూర్తిగా దృష్టిపెట్టిందని, నేపాల్ నుంచి ప్రత్యేకంగా ఇందుకోసం వచ్చిన గురువు ఒకరు ఆమెకు వీటిని నేర్పిస్తున్నారని మనీషా మేనేజర్ సుబ్రతో ఘోష్ చెప్పారు. శారీరకంగా పూర్తి సన్నద్ధంగా ఉన్న మనీషా.. మానసికంగా కూడా కొత్త ప్రాజెక్టు కోసం సిద్ధమవుతోందని, నవంబర్ తర్వాతి నుంచి ఇక చురుగ్గా పని మొదలుపెడుతుందని ఆయన తెలిపారు.

కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో తరచు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటోందని, ఆమె ప్రస్తుతం చాలా చురుగ్గా కోలుకుంటోందని ఘోష్ అన్నారు. ఆరు నెలల పాటు న్యూయార్క్ ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందిన తర్వాత జూన్ నెలలో మనీషా భారత్కు తిరిగొచ్చింది. అప్పటి నుంచి దర్శకులు, నిర్మాతలు ఆఫర్లతో ఆమెను ముంచెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement