నెక్ట్స్‌ ఏంటి? | mani ratnam movie chekka chivantha vaanam remake | Sakshi
Sakshi News home page

నెక్ట్స్‌ ఏంటి?

Nov 25 2018 6:10 AM | Updated on Nov 25 2018 6:10 AM

mani ratnam movie chekka chivantha vaanam remake - Sakshi

రిజల్ట్‌తో సంబంధం లేకుండా చేసే ప్రతీ ప్రాజెక్ట్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచగల దర్శకుడు మణిరత్నం. ఆయన ప్రతీ రిలీజ్‌ తర్వాత అభిమానుల నుంచి వినిపించే  ప్రశ్న నెక్ట్స్‌ ఏంటి? అని. మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ సినిమా ‘చెక్క చివంద వానమ్‌’ (తెలుగులో ‘నవాబ్‌’) మంచి సక్సెస్‌ అయింది. తాజాగా మణిరత్నం నెక్ట్స్‌ విజయ్‌తో సినిమా చేస్తారనే  వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘చెక్క చివంద..’ సినిమాలానే విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నారన్నది మరో వార్త. మరి.. మణిరత్నం నెక్ట్స్‌ సినిమా ఏంటి? అంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడటమే.

Advertisement
 
Advertisement
Advertisement