చిక్కిన ఆఫర్‌?

Mani Ratnam dream movie Ponniyin Selvan with Outstanding Casting - Sakshi

చక్కనమ్మ చిక్కినా అందమే.. ఈ పాత సామెత కొత్తగా మేకోవర్‌ అయినవారికి చక్కగా సరిపోతోంది. ఇప్పుడు రాశీ ఖన్నాని చూసే ఇలానే అనాలనిపిస్తుంది. నిజానికి ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో స్క్రీన్‌ మీద కనిపించినప్పుడు రాశీఖన్నా బొద్దుగానే ఉన్నారు. తర్వాత తర్వాత కొంచెం బరువు తగ్గే పనిలో పడ్డారు. ఇప్పుడైతే మెరుపు తీగలా తయారయ్యారు. ‘బికినీ’కి సూట్‌ అయ్యేట్లు ఫిజిక్‌ని మార్చేసుకున్నారు. బికినీలో ఫొటోషూట్‌ చేయించుకున్న ఫొటోలు కూడా జోరుగా షికారు చేస్తున్నాయి. ఆ మేకోవర్‌ చూసి ‘వావ్‌ రాశీఖన్నా’ అనకుండా ఉండలేకపోతున్నారు. ఇక సినిమాల విషయానికిస్తే రాశీ ఖాతాలో ఓ భారీ సినిమా చేరిందని సమాచారం.

మణిరత్నం దర్శకత్వంలో రూపొందనున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఈ బ్యూటీని కీలక పాత్రకు అడిగారట. చోళుల చరిత్ర ఆధారంగా ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం వెంకీమామ, ప్రతిరోజూ పండగే సినిమాలతో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్న రాశీఖన్నా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కి డేట్స్‌ ఇవ్వడం కోసం డైరీ చెక్‌ చేసుకుంటున్నారట. ఈ చిత్రంలో ‘జయం’ రవి, కార్తీ, విక్రమ్, అధర్వ, ఐశ్వర్యారాయ్, అనుష్కా, కీర్తీసురేశ్, అమలాపాల్‌ ఇలా ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఎప్పటికప్పుడు ఏదో వార్త వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్నామని విక్రమ్, ఐశ్వర్యారాయ్‌ మాత్రమే అధికారికంగా ప్రకటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top