మణిరత్నం ఆఫీస్‌కు బాంబు బెదిరింపు | Mani Ratnam Chennai Office Receives Bomb Threat | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 2 2018 11:58 AM | Last Updated on Tue, Oct 2 2018 4:51 PM

Mani Ratnam Chennai Office Receives Bomb Threat - Sakshi

లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం నవాబ్‌. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర డైలాగ్‌లను తొలగించాలంటూ ఓ అగంతకుడు మణిరత్నం కార్యలయానికి ఫోన్‌ చేసిన బెదిరించాడు. చెన్నైలోని అభిరామపురంలోని మణి ఆఫీస్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదించినట్టుగా మణి ఆఫీసు సిబ్బంది వెల్లడించారు.

అయితే ఏ డైలాగ్‌లను తొలగించాలని అగంతగకుడు డిమాండ్ చేశాడో మాత్రం వెల్లడించలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మణిరత్నం ఆఫీస్‌కు భద్రత కల్పించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్‌27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement