మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా | mani ratnam cheated lightman? | Sakshi
Sakshi News home page

మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా

Apr 18 2017 2:27 AM | Updated on Nov 6 2018 7:53 PM

మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా - Sakshi

మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా

దర్శకుడు మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాని లైట్‌మ్యాన్‌ బెదిరించడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది.

పెరంబూర్‌: దర్శకుడు మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాని లైట్‌మ్యాన్‌ బెదిరించడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. వివరాలు.. మణిరత్నం బాలీవుడ్‌ జంట అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ జంటగా గురు అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్‌లో పనిచేస్తున్న సమయంలో మణిమారన్‌ అనే లైట్‌మ్యాన్‌ రక్తసంబంధిత వ్యాధికి గురయ్యాడు. అతని వైద్య ఖర్చులకు లైట్‌మ్యాన్‌ సంఘం గాని, మణిరత్నం, చిత్ర యూనిట్‌ ఎలాంటి డబ్బు అందించలేదు.

తన లైట్‌మ్యాన్‌ సంఘంపై కోర్టులో కూడా పోరాడాటం.  కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా సంఘం తనకు రావలసిన రూ.2లక్షలు చెల్లించలేదని, ఆ విషయం గురించి అడిగితే సంఘ కార్యదర్శి రామన్‌ రూ.20 వేలు లంచం అడుగుతున్నారని మణిమారన్‌ వాపోయాడు. పదేళ్ల నుంచి తన కుటుంబ సభ్యులే వైద్య ఖర్చులు భరిస్తున్నారని, తనకు రావలసిన నగదు ఇప్పించకపోతే మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని మణిమారన్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement