ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు | Manchu Vishnu, Surabhi Movie Shooting Updates | Sakshi
Sakshi News home page

ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు

Feb 17 2017 10:26 AM | Updated on Sep 5 2017 3:57 AM

ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు

ద్విభాషా చిత్రంలో మంచు విష్ణు

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లుగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారితెరకెక్కుతోన్న తాజా చిత్రం

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లుగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారితెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.  మంచు విష్ణు, సురభిలపై భారీ సెట్ లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ సందర్భంగా వచ్చే లవ్ సీన్స్ కావటంతో ఈ సీన్ కోసం భారీ సంఖ్యలో వెహికల్స్ ను ఉపయోగించి  షూటింగ్ చేస్తున్నారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తికానుంది. జి.ఎస్. కార్తీక్ దర్శకత్వంలో సంపత్ రాజ్, పోసాని కృష్ణమురళి, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement