బాలయ‍్య డైలాగ్‌ చెప్పిన మంచు వారమ్మాయిలు | Manchu Vishnu Shared Intresting Dubsmash Video | Sakshi
Sakshi News home page

Mar 10 2018 12:07 PM | Updated on Aug 29 2018 1:59 PM

Manchu Vishnu Shared Intresting Dubsmash Video - Sakshi

కూతుళ్లు అరియానా, వివియానాలతో మంచు విష‍్ణు

టాలీవుడ్‌ యంగ్ హీరో మంచు విష్ణు నటుడిగానే కాక నిర్మాతగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నాడు. అయితే ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడే విష్ణు, తాజాగా తన కూతుళ్లతో కలిసి చేసిన ఓ ఆసక్తికర డబ్‌స్మాష్‌ వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశాడు. నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని ‘ఐయామ్‌ ద ట్రూత్‌’ డైలాగ్‌ను విష్ణు కూతుళ్లు అరియానా, వివియానాలులతో డబ్‌ స్మాష్ చేయించాడు విష్ణు. గతంలోనే రికార్డ్‌ చేసిన ఈ డబ్‌స్మాష్‌ వీడియోనే త్రోబ్యాక్‌ హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పుడు షేర్‌ చేశాడు విష్ణు.

టాలీవుడ్‌లో మంచు, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిన విషయమే. ఎన్టీఆర్‌, మోహన్‌బాబుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ అనుబంధాన్ని ఈ జనరేషన్‌లోనూ కంటిన్యూ చేస్తున్నారు. అందుకే మంచు ఫ్యామిలీ నిర్మించిన ఊ కొడతార ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య కీలక పాత్రలో నటించి మెప్పించాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికాయాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో రిలీజ్‌ అవుతోంది.ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్‌ సినిమా పనుల్లోనూ బిజీగా ఉన్నాడు మంచు విష్ణు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement