దూసుకొస్తున్నాడు... | manchu vishnu coming on 17th with 'dhusukeltha' | Sakshi
Sakshi News home page

దూసుకొస్తున్నాడు...

Oct 12 2013 11:09 PM | Updated on Sep 1 2017 11:36 PM

దూసుకొస్తున్నాడు...

దూసుకొస్తున్నాడు...

మంచు విష్ణుకు బాగా కలిసొచ్చిన రసం హాస్యం. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో హాస్యాస్త్రాలను సంధించి ప్రేక్షకుల మార్కులు కొట్టేశారు విష్ణు.

మంచు విష్ణుకు బాగా కలిసొచ్చిన రసం హాస్యం. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో హాస్యాస్త్రాలను సంధించి ప్రేక్షకుల మార్కులు కొట్టేశారు విష్ణు. అలాగే... వీరు పోట్ల కూడా కామెడీ పల్స్ తెలిసిన రచయిత, దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే... ఇక నవ్వులకు కొదవ ఉండదని ప్రత్యేకించి చెప్పాలా? వీరి కలయికలో రూపొందిన ‘దూసుకెళ్తా’ సినిమా ఈ నెల 17న థియేటర్లలోకి దూసుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ రోజే ‘దూసుకెళ్తా’ తొలికాపీ చూశాను. విష్ణు అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా అతని నృత్యాలు, పోరాటాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి.
 వీరు పోట్ల టేకింగ్,
రవితేజ వాయిస్ ఓవర్, మంచు లక్ష్మి గెస్ట్ ఎప్పీయరెన్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. 
ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లకు పైగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’అని తెలిపారు. ‘అందాలరాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: 
అరియానా, వివియానా.
 

Advertisement
 
Advertisement
Advertisement