‘రంగస్థలం’ నన్ను వెంటాడుతోంది | manchu manoj tweets on rangasthalam | Sakshi
Sakshi News home page

‘రంగస్థలం’ నన్ను వెంటాడుతోంది

Nov 5 2017 4:52 PM | Updated on Aug 9 2018 7:30 PM

manchu manoj tweets on rangasthalam - Sakshi

సాక్షి, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985.   పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్లో దర్శనమివ్వనున్నారు.  చాలా రోజులుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని భావించారు.  ఇందులో రామ్‌చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

అయితే ఈ సినిమా ఆడియో, మూవీ రిలీజ్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. "నా అన్న రామ్ చరణ్ సాంగ్స్ వినిపించిన దగ్గర నుంచి.. రంగస్థలం నన్ను వెంటాడుతోంది. ఆడియో రిలీజ్, మూవీ కోసం వెయిట్ చెయ్యలేకపోతున్నాను." అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. మనోజ్‌ నటించిన ‘ ఒక్కడు మిగిలాడు’  సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement