నేత కార్మికుల కోసం..

Mallesham Release on June 21st - Sakshi

నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి టైటిల్‌ రోల్‌ చేశారు. రాజ్‌. ఆర్‌ దర్శకత్వంలో రాజ్‌. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని జూన్‌ 21న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రియదర్శితో పాటు, అనన్య, యాంకర్‌ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ విడుదల చేయనుంది. త్వరలోనే పాటలను. టీజర్‌ను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర దర్శక–నిర్మాతలు తెలిపారు. మార్క్‌ కె. రాబిన్‌ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top