మూడు నెలలు బ్రేక్‌ | mahesh bau three months break after Sarileru Neekevvaru | Sakshi
Sakshi News home page

మూడు నెలలు బ్రేక్‌

Nov 5 2019 12:12 AM | Updated on Nov 5 2019 12:12 AM

mahesh bau three months break after Sarileru Neekevvaru - Sakshi

మహేశ్‌బాబు

బ్రేక్‌ లేకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు మహేశ్‌బాబు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మూడు నెలలు బ్రేక్‌ తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి నమ్రత తెలిపారు. ‘‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ పూర్తి కావస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత మహేశ్‌ మూడు నెలలు విరామం తీసుకోవాలనుకుంటున్నారు.

‘మహర్షి’, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలను పెద్ద గ్యాప్‌ లేకుండా పూర్తి చేశారు. అందుకే ‘సరిలేరు...’ తర్వాత హాలిడే ప్లాన్‌ చేయాలనుకుంటున్నారు. మహేశ్‌ గురించి నాకు తెలుసు కాబట్టి.. నెల విరామం తీసుకున్న తర్వాత మళ్లీ పని చేయాలనుకుంటారు’’ అని పేర్కొన్నారు నమ్రత. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement