‘మహర్షి’ మరింత స్టైలిష్‌గా..! | Mahesh Babu New Look From Maharshi | Sakshi
Sakshi News home page

Oct 13 2018 12:24 PM | Updated on Apr 7 2019 12:28 PM

Mahesh Babu New Look From Maharshi - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ మేజర్‌ పార్ట్‌ పూర్తయ్యింది. ఈ మూవీ మహేష్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌ లో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మహేష్ మరో లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీతో కలిసి జర్మనీలో ఎంజాయ్‌ చేస్తున్నాడు.

అక్కడ అభిమానులతో కలిసి దిగిన ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. సూట్‌లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్న మహేష్ లుక్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. అక్టోబర్‌ మూడో వారం నుంచి ఇదే లుక్‌లో అమెరికాలో జరగనున్న షూటింగ్‌లో పాల్గొననున్నాడు మహేష్. ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement