మరో తమిళ దర్శకుడితో మహేష్ | Mahesh babu movie with gautham menon | Sakshi
Sakshi News home page

మరో తమిళ దర్శకుడితో మహేష్

Mar 1 2016 12:57 PM | Updated on Sep 3 2017 6:46 PM

మరో తమిళ దర్శకుడితో మహేష్

మరో తమిళ దర్శకుడితో మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో తమిళ్లో కూడా మంచి విజయం సాధించిన మహేష్ బాబు ఇప్పుడు వరుసగా తమిళ దర్శకులతో...

సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో తమిళ్లో కూడా మంచి విజయం సాధించిన మహేష్ బాబు ఇప్పుడు వరుసగా తమిళ దర్శకులతో పనిచేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు మహేష్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో అక్కడ కూడా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్ సినిమా తరువాత కూడా మరోసారి తమిళ దర్శకుడితోనే సినిమాకు రెడీ అవుతున్నాడు రాజకుమారుడు.

కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా స్టైలిష్ డైరెక్టర్గా మంచి పేరున్న గౌతమ్ మీనన్, దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత అశ్వనిదత్ నిర్మించనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా ప్రకటించిన అశ్వనీదత్, ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
Advertisement