బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆగడు' | Mahesh Babu hits the bull's eye with 'Aagadu' | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆగడు'

Sep 21 2014 12:54 PM | Updated on Sep 2 2017 1:44 PM

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆగడు'

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆగడు'

ప్రిన్ మహేష్బాబు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 'ఆగడు'తో ముందుకు వచ్చిన వచ్చిన ఈ సూపర్ స్టార్ భారీ ఓపెనింగ్స్ రాబట్టాడు.

చెన్నై: ప్రిన్ మహేష్బాబు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 'ఆగడు'తో ముందుకు వచ్చిన ఈ సూపర్ స్టార్ భారీ ఓపెనింగ్స్  రాబట్టాడు. ఆగడు సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.18.02 కోట్లు వసూలు చేసింది. మహేష్ కెరీర్ లోనే ఈ కలెక్షన్ భారీ ఓపెనింగ్స్ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వసూళ్లపరంగా ఈ సినిమా కచ్చితంగా కొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే 'ఆగడు'పై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ మహేష్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా ఒక మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సోనూ సూద్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement