రాజమౌళికి మహేష్ శుభాకాంక్షలు | Mahesh Babu Congratulate SS Rajamouli | Sakshi
Sakshi News home page

Apr 14 2018 1:57 PM | Updated on Apr 14 2018 3:51 PM

Mahesh Babu Congratulate SS Rajamouli - Sakshi

బాహుబలి 2 సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగును అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు రాజమౌళిని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆకానికెత్తేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూడా రాజమౌళికి, బాహుబలి టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ సినిమా బాహుబలి భారతీయ సినీచరిత్రలో ఓ మైలురాయి. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేయల్‌ నారాయణ ఈ కాంబినేషన్‌ లో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement