సూపర్స్టార్ కొత్త కారు | Sakshi
Sakshi News home page

సూపర్స్టార్ కొత్త కారు

Published Tue, Nov 10 2015 9:45 AM

సూపర్స్టార్ కొత్త కారు

శ్రీమంతుడు సక్సెస్ మహేష్ బాబులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాతో హీరోగానే కాక నిర్మాతగా కూడా విజయం సాధించిన మహేష్ అదే జోష్‌లో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. తనకు శ్రీమంతుడు లాంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ కొరటాల శివకు లేటెస్ట్ మోడల్ కారును బహుమతిగా అందించిన మహేష్, దీపావళి పండుగ సందర్భంగా తన ఫ్యామిలీ కోసం కూడా కొత్త కారు కొన్నాడు.

ప్రస్తుతం సంపన్నవర్గాల్లో స్టేటస్ సింబల్గా భావిస్తున్న రేంజ్ రోవర్ కారును దీపావళి పండుగ సందర్భంగా మహేష్ కొనుగొలు చేశాడు. ఆ కారు ముందు, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి మహేష్ బాబు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ బాబు తిరిగి షూటింగ్లతో బిజీ అయ్యాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం షూటింగ్లో పాల్గొంటున్నాడు మహేష్. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పివిపి సినిమాస్ బ్యానర్తో పాటు మహేష్బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2016 సమ్మర్ లోరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement