రొమాంటిక్‌ మూడ్‌లో భరత్‌ | Mahesh Babu Bharath Ane Nenu New Poster | Sakshi
Sakshi News home page

Mar 31 2018 3:54 PM | Updated on May 10 2018 12:13 PM

Mahesh Babu Bharath Ane Nenu New Poster - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో కొత్త పోస్టర్లతో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్‌కు సంబంధించిన స్టిల్స్‌ ను మాత్రమే రిలీవ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా హీరోయిన్‌ లుక్‌ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. మహేష్ తో పాటు కైరా నడిచి వస్తున్న ఈ స్టిల్‌ సూపర్‌ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈసినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వాని టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. 

ప్రస్తుతం స్పెయిన్‌ లో సాంగ్స్‌ షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరగుతున్నాయి. ఏప్రిల్‌ 7న భరత్‌ అనే నేను ప్రీ రిలీజ్‌ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమాలోని రెండో పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ పాటను ఆలపించిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌కు మహేష్ కృతజ‍్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement