ఆల్‌టైం రికార్డ్‌ దిశగా ‘భరత్‌ అనే నేను’ | Mahesh Babu Bharat Ane Nenu 2000 Premiere Shows In USA | Sakshi
Sakshi News home page

Apr 6 2018 11:15 AM | Updated on May 10 2018 12:13 PM

Mahesh Babu Bharat Ane Nenu 2000 Premiere Shows In USA - Sakshi

భరత్‌ అనే నేను సినిమాలో మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్‌ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 20న రిలీజ్‌ అవుతోంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ఓవర్‌ సీస్‌ రిలీజ్‌ను భారీగా ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఓవర్‌సీస్‌ లో మహేష్ కు మంచి మార్కెట్‌ ఉంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఫ్లాప్‌ సినిమాలు కూడా అక్కడ మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించాయి. అందుకే భరత్‌ అనే నేను సినిమాను అక్కడ మరింత భారీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఏప్రిల్‌ 19న దాదాపు 2000 ప్రీమియర్‌ షోస్‌ వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్‌. గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్‌ షోస్‌ ను వేయలేదు. దీంతో కేవలం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారానే ఈ సినిమా మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు. శనివారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement